ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం.. దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని...? ఓవైసీ

శనివారం, 21 మే 2022 (18:54 IST)
జ్ఞాన్‌వాపి మసీదును వివాదంలోకి లాగడంతో బాబ్రీ మసీదు వంటి ఘటన పునరావృతం అవుతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  
 
జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారంలో కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు ఓవైసీ చెప్పారు. దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని సంఘ్ పరివార్ యోచిస్తోందని ఓవైసీ తెలిపారు.
 
అలాగే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమంటూ జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదించడంపై ఒవైసీ స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్లకు తాను వ్యతిరేకమని ఓవైసీ పేర్కొన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు