మహిళలకు దిశా ప్రొటెక్షన్.. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా మళ్లీ వంశీ ప్రియారెడ్డి నియామకం

శనివారం, 25 ఫిబ్రవరి 2023 (17:04 IST)
Vamsi Priya Reddy
మహిళలపై ఆగడాలను అరికట్టేందుకు మహిళలకు న్యాయం చేయడంలో ముందుంటుంది దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ సంస్థ 2000 సంవత్సరంలో పురుడు పోసుకుంది. మహిళలకు న్యాయం చేసే దిశగా స్థాపించబడిన ఈ సంస్థ.. సమాజంలో మహిళల సమస్యలను అధిగమించేందుకు సాయపడుతుంది. 
 
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలను రక్షిస్తుంది. అలాగే ఆన్‌లైన్ / సోషల్ నెట్‌వర్క్ బ్లాక్ మెయిలింగ్ వంటి అకృత్యాల నుంచి మహిళలకు అండగా నిలుస్తుంది. 
 
ఇకపోతే.. తాజాగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్  సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి వంశీప్రియారెడ్డి నియామకం అయ్యారు. మహిళా సాధికారతకు నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ జర్నలిస్ట్  కె.వంశీప్రియారెడ్డి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్, సంగారెడ్డి అధ్యక్షురాలిగా రెండోసారి  నియమితులయ్యారు.
 
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి 2007లో  మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం పూర్తిచేశారు. అదే ఏడాది తేజ టీవీలో చేరారు. ఆ  తర్వాత సాక్షి టీవీ, వనితటీవీ, మోజో టీవీలలో వివిధ రకాల బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుంచి ప్రజాటైమ్స్ అనే వెబ్ సైట్, దర్శనం లైవ్, వసుధ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ పనిచేసినా స్త్రీలకు సంబంధించిన అంశాలపై కార్యక్రమాలు రూపొందించడంలో ముందుంటారు. 
 
అలా స్త్రీల సమస్యలపై చేసిన ఎన్నో స్టోరీలకు, చర్చా కథనాలకు యూనిసెఫ్.. లాడ్లి, ఎన్టీ  వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా స్త్రీల కోసమే ‘వసుధ టీవీ’ నడుపుతూ మహిళా సాధికారతకు అహరహం కృషిచేస్తున్నారు.
 
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలపట్ల చూపుతున్న భేదభావం మానవ ప్రగతికి విఘాతం కలిగిస్తుంది. అలా వివక్షకు గురవుతున్న మహిళలకు చేయూతనందిస్తూ అండగా నిలుస్తోంది దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్. ఇలాంటి ఫౌండేషన్ కు స్త్రీల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వంశీప్రియారెడ్డిని అధ్యక్షులుగా నియమించడం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.  
 
ఈ సందర్భంగా వంశీప్రియారెడ్డి మాట్లాడుతూ.. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి నియామికం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. 
Vamsi Priya Reddy
 
తనపై నమ్మకం ఉంచి బాధ్యతను, మరోసారి అవకాశాన్ని కల్పించిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మెన్ బి. వెంకటేశ్వరరావు గారికి, కల్యాణి గారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. 14 మంది కార్యవర్గ కమిటీ సభ్యులతో రెట్టింపు ఉత్సాహంతో మహిళలకు మరింత సేవలు చేయనున్నట్లు మీడియాతో అన్నారు.   
 
ప్రతి మహిళా నిర్భయంగా అన్నీ రంగాలల్లో రాణించిన్నప్పుడే స్త్రీ కి నిజమైన స్వేచ్ఛ ఉన్నట్లు అంటూ వంశీప్రియారెడ్డి వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు