జగిత్యాల జిల్లాలో కొవిడ్ కేసులు ఇటీవల కాలంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో డిస్ట్రిక్ట్‌లోని కొన్ని విలేజెస్ స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నాయి. వెల్గటూర్ మండలం ఎండపల్లి, మద్దుట్లలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఆ గ్రామ పెద్దలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపారు.
నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.1,000 ఫైన్ విధించనున్నట్లు గ్రామపంచాయతీ పాలక వర్గం తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్తంగాను రోజురోజుకూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ముప్పు గురించి కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరిస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు సూచిస్తున్నది.
అయితే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో కేసులు పెరగడాని కంటే ముందుగానే ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు పెళ్లిళ్లకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నది. అతి తక్కువ మంది అతిథుల మధ్యనే శుభకార్యాలు చేసుకోవాలని సూచిస్తుంది.