హరీష్... నీ జాతకం.. నీ మామ జాతకం బయటపెడతా : రేవంత్ రెడ్డి

శనివారం, 31 జనవరి 2015 (15:28 IST)
తెలంగాణ రాష్ట్రమంత్రి టి హరీష్ రావుకు టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు వంటి వారి బెదిరింపులకు భయపడేవాడిని తాను కానన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ నీ జాతకం, నీ మామ (కేసీఆర్) జాతకం రోజుకొకటి చెప్పున బయట పెడతానంటూ హరీష్ రావును హెచ్చరించారు. 
 
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం... అనవసర విషయాలపై దృష్టి సారిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కేబినెట్ మొత్తం కేసీఆర్ భజనలో నిమగ్నమైందని ఆరోపించారు. బంగళాలపై ఉన్న ఆసక్తి... రాష్ట్రంలో నెలకొన్న కరవు, రైతు ఆత్మహత్యలపై ఎందుకు లేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ సర్కారు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న వారు... ఆ విషయంపై ఎందుకు చర్చించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి