కరోనా సత్వర టెస్టుల కోసం 7 లక్షల కిట్లు

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:13 IST)
కరోనా నిర్ధారణ కోసం త్వరితగతిన టెస్టులు నిర్వహించేందుకు మరిన్ని కిట్లు తెప్పించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) నిర్ణయించింది. 7 లక్షల టెస్టింగ్​ కిట్లను తెప్పించనున్నట్లు స్పష్టం చేసింది.

మరో రెండు రోజుల్లోనే అవి ఆయా కేంద్రాలకు అందనున్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా బాధితుల సంఖ్య 4000 వేలు దాటింది. అయితే.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా పరీక్షలు నత్తనడకన సాగుతున్నాయి. రోజూ 10 వేలకు మించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్​ శుభవార్త చెప్పింది. 7 లక్షల టెస్టింగ్​ కిట్లకు ఆర్డరిచ్చామని.. ఏప్రిల్​ 8కల్లా వస్తాయని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూసిన హాట్​స్పాట్​లోనే వీటిని ఎక్కువగా వినియోగించనున్నారు. బుధవారం నాటికి ఐసీఎంఆర్​కు సుమారు 7 లక్షల రాపిడ్​ కరోనా యాంటీబాడీ పరీక్ష కిట్లు అందనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు