రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లక్ష్మాపూర్ గ్రామంలో జరిగిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో లేని హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు వేల ఎకరాలను వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి ఆక్రమించిన భూములపై ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామని రేవంత్ అన్నారు. అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డిని జైలుకు పంపుతుందని హెచ్చరించారు. ఆక్రమిత స్థలంలో వైద్య కళాశాలను మంత్రి నిర్మిస్తున్నారని ఆరోపించారు.
మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ అండదండలు ఉన్నాయని, అందువల్లే వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆయన ఆక్రమించుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరాస పాలకులకలు భవిష్యత్‌లో చిక్కులు తప్పవని ఆయన హెచ్చరించారు.