వివాహేతర సంబంధానికి అడ్డొస్తానని అనుమానంతో భర్తను భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట పరిధిలో గల బోడియాతండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడియాతండాకు చెందిన కున్‌సోతు రవి(35) బుధరావుపేట గ్రామానికి చెందిన దావూద్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
అయితే దావూద్‌కు రవి భార్య భారతికి ఆరు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం దావూద్ వద్ద రవి డ్రైవర్ పని మానేశాడు. అయినా భారతి ఇంటికి దావూద్ వెళ్తుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతో రవిని హత్య చేయాలని అతని దావూద్, భారతి పథకం పన్నారు. ఏప్రిల్ 23న రవితో ఫుల్‌బాటిల్ మందు తెప్పించుకుని బుధరావుపేట గ్రామ శివారులోకి వెళ్లి మద్యం తాగాడు దావూద్.