సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళల ఎదుగుదలను గుర్తించే రోజుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ఇస్తున్నట్టు తెలిపింది. ప్రైవేటు సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు కూడా క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఆదేశించారు. అన్ని సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు విధిగా సెలవు ఇవ్వాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, ఈ నెల 8వ తేదీన హోళీ పండుగను పురస్కరించుకుని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ప్రతి యేటా 8వ తేదీన హోళీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ప్రకారంగా ఈ యేడాది కూడా ప్రభుత్వం హోళీ పండుగకు సెలవు ప్రకటించింది.