అనుష్క నిజంగానే లవ్‌లో పడిందా..?!

శుక్రవారం, 9 ఆగస్టు 2013 (18:19 IST)
WD
సినిమా వాళ్ళ లవ్‌లు రియల్‌ లైఫ్‌లో రకరకాల మలుపులు తిరుగుతుంటాయి. నటి అనుష్క లవ్‌ విషయంలో చాలా క్లారిటీలో ఉంది. గతంలో ఈ విషయంలో చాలా చెప్పింది. లవ్‌ చేసి పెళ్లి చేసుకుంటే... నేను ఇండస్ట్రీకి దూరంగా ఉంటానని చెప్పింది. ఆ తర్వాత కొన్ని కారాణాల వల్ల ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.

కానీ ప్రస్తుతం ఆమె చుట్టూ మీడియా తిరుగుతోంది. తమిళనాడు మీడియా మాత్రం ఆమెను వదిలిపెట్టడంలేదు. నటుడు ఆర్యతో రొమాన్స్‌ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో రుద్రమదేవి చిత్రం షూటింగ్‌ సమయంలో ఆమెతోపాటే ఆర్య ఉండడం విశేషాన్ని సంతరించుకుంది.

ఆర్య సూచనలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లవ్‌ కనుక నిజమైతే త్వరలో అనుష్క జోడీగా చూడవచ్చు అన్నమాట. రుద్రమదేవి చిత్రం తర్వాతే ఆమె ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందని కథనాలు విన్పిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి