ఓరుగల్లులో 'రుద్రమదేవి' స్టీరియో స్కోపిక్‌ 3డి మూవీ టీమ్‌

సోమవారం, 3 డిశెంబరు 2012 (16:46 IST)
WD
'అరుంధతి' అనుష్కతో డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై రూపొందిస్తున్న భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రం టీమ్‌ 3డి టెస్ట్‌ షూట్‌ కోసం జర్మనీ వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్‌ షూట్‌ పూర్తి చేసుకొని వరంగల్‌ చేరుకుంది 'రుద్రమదేవి' టీమ్‌.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్‌ మాట్లాడుతూ - ''జర్మనీలో వారం రోజులపాటు ఈ చిత్రానికి సంబంధించిన 3డి టెస్ట్‌ షూట్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశాం. రిజల్ట్‌ చాలా సంతృప్తికరంగా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాం. జర్మనీ నుంచి ఓరుగల్లు చేరుకున్నాం. మా ఆర్ట్‌ డైరెక్టర్‌ పద్మశ్రీ తోట తరణిగారితో కలిసి వరంగల్‌ కోట, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప గుడి తదితర కట్టడాలను సందర్శించడం జరిగింది. అప్పటి కట్టడాల నిర్మాణం గురించి కొందరు చరిత్రకారులతో చర్చలు జరిపాం.

ఈ ఒరిజినల్‌ లొకేషన్స్‌ అన్నీ సందర్శించి ఈ సినిమాకి సంబంధించిన సెట్స్‌ని మా ఆర్ట్‌ డైరెక్టర్‌ తోట తరణిగారు నిర్మిస్తున్నారు. స్కెచ్‌లు అన్నీ రెడీ అవుతున్నాయి. 13వ శతాబ్దపు కాకతీయ వైభవాన్ని తెరపై చూపించే ప్రయత్నాన్ని 'రుద్రమదేవి'లో చేస్తున్నాం. ఇది ఇండియాలోనే ఫస్ట్‌ హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి మూవీ'' అన్నారు.

'రుద్రమదేవి'గా అరుంధతి అనుష్క నటిస్తున్న ఈ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్‌: పద్మశ్రీ తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్‌ విన్సెంట్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: కమల్‌ కణ్ణన్‌(ప్రసాద్‌ ఇఎఫ్‌ఎక్స్‌), కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నీతా లుల్లా(జోధా అక్బర్‌ ఫేం), నిర్మాత: గుణశేఖర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్‌.

వెబ్దునియా పై చదవండి