కోలీవుడ్ హీరోలకు మన "మగధీర" ప్రేరణ...

మంగళవారం, 3 మే 2011 (17:47 IST)
WD
తెలుపు - నలుపు కాలంలో చారిత్రాత్మక చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతుండేవి. ఆ చిత్రాలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరించేవారు. అయితే 80 దశకంలోకి వచ్చేసరికి దర్శకనిర్మాతలు సాంఘిక, ప్రేమకథా చిత్రాలవైపు మొగ్గు చూపారు. దాంతో హీరోలు కూడా బెల్‌బోటమ్, పెద్దసైజు కాలర్లున్న చొక్కాలను వేసుకుని నటించాల్సి వచ్చింది.

అడపాదడపా సింహాసనం వంటి చారిత్రాత్మక చిత్రాలు వచ్చినప్పటికీ అవేమంత చెప్పుకోదగ్గ చిత్రాలేమీ కావు. అయితే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ మగధీర చిత్రంతో టాలీవుడ్‌నే కాదు... దక్షిణాది చిత్ర పరిశ్రమ దృష్టినీ మరల్చాడు. అదే కోవలో శక్తి చిత్రం వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఢాం‌మని పేలిపోయింది. ఇపుడు బద్రీనాథ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ పరిస్థితి ఇలావుంటే ఇపుడు కోలీవుడ్ చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంతో బిజీగా మారిపోయింది. ఇటీవల ప్రశాంత్ హీరోగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి రచించిన పొన్నర్ - శంకర్ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన చిత్రం సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఇపుడు కోలీవుడ్ దర్శకులు చారిత్రాత్మక కథా చిత్రాలపై దృష్టి సారించారు.
PR


తాజాగా రజినీకాంత్ హీరోగా రాణా చిత్రకథ ఈ కోవలోనిదే. 17వ శతాబ్దపు స్థితిగతులను వివరిస్తూ కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఖడ్గంతో ప్రత్యర్థుల్ని ఊచకోత కోసే వీరుగా రజినీ కనిపించబోతున్నారు.

వెబ్దునియా పై చదవండి