"డర్టీ పిక్చర్‌"లో విద్యా బాలన్ నటనకు జాతీయ అవార్డు

బుధవారం, 7 మార్చి 2012 (15:48 IST)
"ద డర్టీ పిక్చర్" సినిమాకి విద్యాబాలన్ జాతీయ అవార్డు గెలుచుకుంది. ద డర్టీ పిక్చర్‌లో ఆమె నటనా ప్రతిభకి ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం ఆమెకు మరింత ఆనందాన్నిస్తోంది. అవార్డులకు సంబంధించిన అధికారిక ప్రకటన మార్చి 7తేదీన రాజధాని నగరంలో జరిగింది. 

మిలన్ లుథ్రియా దర్శకత్వం వహించిన ద డర్టీ పిక్చర్‌లో దక్షిణాది సెక్స్ సింబల్ అయిన సిల్క్ స్మిత పాత్రను ఆమె పోషించింది. దీనికి సంబంధించి ప్రేక్షకుల నుంచీ, విమర్శకుల నుంచీ అభిప్రాయ సేకరణ కూడా జరిగింది.

విద్యాబాలన్ ప్రస్తుతం "కహానీ" చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆమె గతంలో ఆర్.బల్కీ యొక్క "పా" అలాగే విశాల్ భరద్వాజ్ యొక్క "ఇష్కియా" చిత్రాలకు గౌరవ పురస్కార అవార్డులను గెలుచుకుంది. దీంతో విద్యాబాలన్ హ్యాట్రిక్ కొట్టినట్టయింది.

దర్శకుడు ఒనిర్ యొక్క "ఐయామ్"-ఉత్తమ హిందీ చిత్రంగా బుధవారం జరిగిన 59వ జాతీయ అవార్డుల కార్యక్రమంలో ప్రకటించబడింది. అదేవిధంగా ఆ చిత్రంలో "అగర్ జిందగీ"-అనే పాటకి అమితాబ్ భట్టాచార్య ఉత్తమ గేయ రచయిత అవార్డును గెలుచుకున్నాడు. షారూఖ్ ఖాన్ సూపర్ హీరో చిత్రం "రా ఒన్"- 59వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా స్థానం పొందింది. హార్రీ హింగోరాని, కైతన్ యుదవ్‌లు "రా ఒన్" చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ కూర్చినందుకు అవార్డును గెలుచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి