తిరుపతిలో రంభ - ఇంద్రుల వివాహ మహోత్సవం

WD
దక్షిణాది వెండితెరపై గ్లామర్ పంట పండించిన తార రంభ. ఈ నటీమణి వివాహం గురువారం... అంటే ఏప్రిల్ 8న తిరుపతిలో జరుగనుంది. కెనడా వ్యాపారవేత్త ఇందిరన్‌తో వివాహ నిశ్చితార్థం జనవరి 27న జరిగిన సంగతి విదితమే.

ఈ వివాహానికి రంభ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలిసింది. ఇక సినిమా స్నేహితులతోపాటు ఇతర ప్రముఖులు ఏప్రిల్ 11న చెన్నైలో జరిగే రిసెప్షన్ కార్యక్రామానికి ఆహ్వానించాలని రంభ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వివాహమైన తర్వాత కూడా సినిమాల్లో నటించాలని రంభ అనుకుంటోంది. అయితే అర్థవంతమైన పాత్రలను మాత్రమే అంగీకరిస్తానని చెపుతోంది. సినిమాల్లో నటించడం బోర్ ఫీలైనప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి భర్త చేస్తున్న వ్యాపారంలో పాలుపంచుకుంటానంటోంది.

చెన్నైలోని రాణి మియామ్మి హాలులో రిసెప్షన్ జరిగిన తర్వాత నూతన జంట న్యూజీలాండ్‌కు హనీమూన్ వెళతారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు సినిమాలతోపాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, బెంగాలీ, భోజ్ పురి చిత్రాల్లో కూడా రంభ నటించింది.

మరి మనం కూడా రంభ పెళ్లి సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెపుదామా...

వెబ్దునియా పై చదవండి