నాకు తమిళమంటేనే ఇష్టం: రామనారాయణ

ఎవరైనా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంతం గురించి ఇష్టమున్నా లేకపోయినా గొప్పగా చెపుతారు.. చెప్పాలి కూడా... అది రూలు!! కానీ తమిళ నిర్మాత రామనారాయణ అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించడంతో కాస్త గందరగోళమైంది. తాను తమిళంలో నిర్మించిన ఓ చిత్రాన్ని తెలుగులో "కారా మజాకా" పేరుతో అనువదిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మంగళవారం హైదరాబాద్ వచ్చారు. "దేశంలో దాదాపు అన్ని భాషల్లోనూ కలిసి 120 సినిమాలు చేశాను. తెలుగులో చిరంజీవి నటించిన పున్నమినాగు సినిమా కథ నేనే ఇచ్చాను. అలాగే నాగబాల సినిమా కూడా తీశాను. ఎన్ని భాషల్లో తీసినా తమిళమంటే నాకు ఇష్టమ"ని దర్శక నిర్మాత రామనారాయణ అన్నారు.

దీంతో సభలో కాసేపు మౌనం తాండవించింది. పైగా తను మాట్లాడాల్సింది తమిళంలో రాసుకుని తెలుగులో చదివి వినిపించారు. దీంతో అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. తెలుగు సినిమా ప్రమోషన్‌లోకి వచ్చి తమిళం గురించి చెప్పుకోవడం సరికాదనీ, తెలుగులో విడుదల చేయడం ఎందుకని... మీడియాలో కొంతమంది నేరుగా ఆయనను ప్రశ్నించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి