నాని: 'డి ఫర్ దోపిడీ'తో నిర్మాత కష్టాలు తెలిసాయి

బుధవారం, 18 డిశెంబరు 2013 (13:23 IST)
FILE
నేను ఇంతవరకు సహాయ దర్శకునిగా, నటుడిగా పని చేశాను. అందువల్ల సినిమా నిర్మాణం వరకే తెలిసింది. ఇప్పుడు 'డీ ఫర్ దోపిడి' సినిమాకి నిర్మాతనయ్యాను. దీనివల్ల నిర్మాత కష్టమేంటో తెలిసిందని 'పైసా' హీరో నాని అంటున్నాడు.

అష్టాచెమ్మా నుంచి పిల్లజమిందార్‌ వరకు చిత్రాలు చేసేశాడు. పైసా చిత్రం ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా డీ ఫర్‌ దోపిడీ రిలీజ్‌లోఉంది. ఈ సినిమాలో ఆయన ఒక పార్టనర్. చిత్రం ప్రమోషన్‌ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిర్మాతగా ఉంటే అతను పడే టెన్షన్‌ ఏమిటో ఎన్ని ఆటంకాలు ఉంటాయో అవన్నీ డీ ఫర్‌ దోపిడీ సినిమా ద్వారా తెలుసుకున్నానని వెల్లడించారు. ఈ అనుభవాలన్నీ భవిష్యత్‌లో నిర్మాణ సంస్థను పెడితే దానికి బాగా ఉపయోగపడతాయని చెబుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి