తెలుగు సినిమా గాడ్‌ఫాదర్ రఘుపతి వెంకయ్యనాయుడుపై సినిమా రూపొందుతోంది. కృష్ణ కుమారుడు నరేష్ టైటిల్ పాత్రను పోషిస్తుండగా, బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్లోలైన్ పిక్చర్స్ పతాకంపై మండవ సతీష్‌బాబు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారంనాడు సినిమా ప్రారంభమైంది. తొలిషాట్‌కు కృష్ణ క్లాప్ నివ్వగా, విజయనిర్మల స్విచ్చాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించారు.
విజయనిర్మల మాట్లాడుతూ, రఘుపతి వెంయ్య తెలుగు సినిమా పితామహుడు. ఆయన పేరు ఉన్న అవార్డు నాకు రావడం గర్వకారణం. సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా, వందేళ్ళ భారతీయ సినిమాకి అంకితమిస్తూ.. ఈ సినిమా తీయడం ఆనందంగా ఉందని అన్నారు.
నరేష్ మాట్లాడుతూ, వెంకయ్యనాయుడు జన్మస్తలం మచిలీపట్నంలో ఆయన గురించి ఏ చిహ్నాలూ లేవు. కనీసం విగ్రహం నిర్మించడానికైనా ప్రభుత్వం పూనుకోవాలి అన్నారు.