వేశ్య, యువరాణి పాత్రలతో శ్రియకు సవాల్

శనివారం, 16 ఫిబ్రవరి 2013 (19:09 IST)
WD
నేటితరం కథానాయికల కెరీర్ 10 సినిమాలు, 3 హిట్, 5 ప్లాప్, 2 యావరేజ్‌తో పట్టుమని పదేళ్లు కూడా సాగదనే అభిప్రాయాన్ని అబద్ధం చేస్తూ శ్రియ విజయవంతంగా కథానాయికగా ముందుకు దూసుకుపోతుంది. ఆమె కథానాయికగా దక్షిణాది, ఉత్తరాది భాషల్లో 50 కు పైగా సినిమాలు చేసింది.

తాజాగా శ్రియ నటించిన 'మిడ్ నైట్స్ చిల్డ్రన్' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో పార్వతి పాత్రలో శ్రియ నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె రెండు స్త్రీ ప్రాధాన్య పాత్రల్లో నటిస్తోంది. ఒకటి 'పవిత్ర' మరొకటి 'చంద్ర'. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్న చంద్రలో యువరాణిగా నటిస్తోంది. పవిత్రలో వేశ్యపాత్రలో కనిపించనుంది.

రెండు విభిన్న కోణాలున్న పాత్రలు చేయడం శ్రియకు సవాల్ లాంటిదే. ధైర్యసాహసాలున్న పవిత్రగా శ్రియ నటన బాగుందనీ, నిజాయితీగా చేస్తున్న ఈ ప్రయత్నం కుటుంబసమేతంగా చూడదగ్గ విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు జనార్థన మహర్షి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి