సమంతకు బుద్ధిచెప్పిన చార్మి....!

శనివారం, 17 ఆగస్టు 2013 (11:05 IST)
FILE
టాలీవుడ్ క్రేజీ స్టార్ సమంతకు చార్మి బుద్ధి చెప్పింది. వరుస హిట్‌లతో మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న సమంత ఇప్పుడు అభిమానులపై విసుక్కుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమా షూటింగ్ రోడ్లమీద జరుగుతోంది.

రోడ్ల మీద సమంత లాంటి హీరోయిన్ ఉంటే ఇంకేమైనా ఉందా జనాలు ఎగబడుతుంటారు. అయితే ప్రేక్షకులు తన చూట్టూ చెరడంపై సమంత సీన్ చేస్తోంది. చుట్టూ మనుషులు గుమిగూడితే తనకు జూలో ఉన్న ఫీలింగ్ కలుగుతోందట. నాకు ఈ రోజు బ్యాడ్ డే అంటూ ట్వీట్ చేసింది.

అందుకు స్పందించిన ఛార్మి అలా అందరూ గుమిగూడిన చోట కూడా మనం నటించాలనే మనకు అంతంత పారితోషికాలు ఇస్తున్నారు. నేను షూటింగ్ చేస్తున్న ప్రదేశంలోనూ చిన్న మేకప్ వేన్ పెట్టే స్థలం కూడా లేదు. అయినా సర్దుకుపోతున్నాను అని ఘాటుగానే బుద్ధి చెప్పింది.

ఏ ప్రజల వల్ల సినిమాలకు కోట్లకు కోట్లు వస్తున్నాయో, ఏ ప్రజల వల్ల స్టార్‌డమ్ వస్తోందో వారిని విసుక్కుంటే చాలా నష్టం జరుగుతుందనే సంగతి సమంత తొందరగా గ్రహించాలి. లేకుంటే ఇబ్బందే.

వెబ్దునియా పై చదవండి