బాలీవుడ్ ప్రౌఢసుందరి మనీషా కొయిరాలా ఓ ఇంటిది కాబోతోంది. నిన్నటితో 41 ఏళ్లు నిండిన మనీషా కొయిరాలా సమ్రాట్ దహల్ అనే కుర్రాడిని నేపాల్ లోని ఖాట్మాండులో వివాహమాడబోతోంది. ఆమె వివాహానికి నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్, ప్రధాని మాధవ్ కుమార్, మావోయిస్ట్ చీఫ్ ప్రచండ, జ్ఞానేంద్రతోపాటు బాలీవుడ్ నటుడు గోవింద కూడా హాజరవుతారని సమాచారం.