అఖిల్ అక్కినేని : నాతో మామ్.. అండ్ డాడ్ స్పెయిన్‌లో హ్యాపీ హ్యాపీ!

శుక్రవారం, 22 మే 2015 (16:26 IST)
మిస్సైల్ మూవీపై వస్తున్న రూమర్స్‌కు అఖిల్ అక్కినేని ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చాడు. స్పెయిన్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో అమలా నాగార్జున పాల్గొన్నారని.. వీవీ వినాయక్ డైరక్షన్‌కు చిట్కాలిస్తున్నారని.. అఖిల్ అక్కినేనికి షూటింగ్ స్పాట్‌లో సలహాలు ఇస్తున్నారని వస్తున్న వదంతులకు అఖిల్ ఫుల్ స్టాప్ పెట్టాడు. అఖిల్ సినిమా సీన్స్‌ను ప్రేక్షకుల్లా వీక్షిస్తూ కనిపించిన అమలా నాగార్జున ఫోటోలను అఖిల్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 
 
తన ఫైట్ వర్క్‌ను మోనిటర్ ద్వారానే పారెంట్స్ చూశారని ఫోటోలతో పాటు అఖిల్ పోస్ట్ చేశాడు. తన తొలి సినిమా విదేశీ షెడ్యూల్‌ స్పెయిన్‌లో జరుగుతోందని.. అమ్మానాన్న స్పెయిన్ సెట్స్ సందర్శించడం తనకెంతో గర్వంగా ఉందని అఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి