టోర్నటోలో మరో పాపకు జన్మనిచ్చిన రంభ..!

బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:19 IST)
ప్రముఖ హీరోయిన్ రంభ మరో పాపకు జన్మనిచ్చింది. గతంలో టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలిగిన రంభ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం తను టోర్నటో లోని హాస్పిటల్‌లో పండంటి పాపకు జన్మనిచ్చింది. పాప, రంభ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
 
రంభకు ఇప్పటికే మూడేళ్ళ వయసున్న లావణ్య అనే కుమార్తె వుంది. ఇప్పుడు ఆమె మరో ఆడపిల్లకి టొరంటోలోనే జన్మనిచ్చింది. కాగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో 1990ల్లో రంభ క్రేజీ హీరోయిన్‌గా వెలిగింది. తెలుగు 'బావగారు బాగున్నారా', తమిళంలో 'ఉల్లతై అల్లిత', 'అరుణాచలం' వంటి పలు చిత్రాలతో పాటు బోజ్‌పురి చిత్రాల్లో కూడా నటించింది.

వెబ్దునియా పై చదవండి