బెదిరింపు కేసులో బాలీవుడ్ నటి సనా ఖాన్ అరెస్టు!

గురువారం, 30 అక్టోబరు 2014 (09:28 IST)
బాలీవుడ్ నటి సనా ఖాన్‌ను ముంబై నగర పోలీసులు అరెస్టు చేశారు. ఓ మీడియా కన్సల్టెంట్‌ను బెదిరించినందుకు గాను ఆమెను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. సనా ఖాన్తో పాటు ఆమె బాయ్ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ వారి సహాయకుడు రాము కనోజియాలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇటీవల ఓ వార్తా పత్రికలో సనా ఖాన్కు సంబంధించి ఓ వార్త ప్రచురితమైంది. పూనమ్ ఖన్నా అనే మీడియా కన్సల్టెంట్ ఈ వార్తను అందించిందని భావించిన సనా ఖాన్, ఇస్మాయిల్ ఆమెను బెదిరించి అనుచితంగా ప్రవర్తించారు. పూనమ్ ఫిర్యాదు మేరకు సనా ఖాన్, ఇస్మాయిల్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, సనా ఖాన్‌తో పాటు.. అరెస్టు చేసిన వారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం విడుదలయ్యారు. 

వెబ్దునియా పై చదవండి