ఇందుకు ప్రధాన కారణం, ఇది 'దూకుడు' కాంబినేషన్ కావడమే. దర్శకుడు శ్రీను వైట్ల సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనే ట్యాగ్ ఒకటుంది. దానికి తోడు, అలాంటి కథలను మహేష్ బాబు ఇరగదీస్తాడు. సునాయాసంగా మోసేస్తాడు.
ఈ కారణాల మూలంగానే ఈ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ జరుపుకుని లాభాలు మూటగట్టుకుంది. టాలీవుడ్ ట్రేడ్ లెక్కలను బట్టి చూస్తే, మొత్తానికి ఈ సినిమా 10 కోట్ల లాభాలను ప్రీ రిలీజ్ స్టేజ్ లోనే పొందింది. ఇటీవలి కాలంలో ఇదొక రికార్డుగానే చెప్పుకోవచ్చు. సినీ పండితులు అంటున్నారు.