దెయ్యంగా కనిపించనున్న ఎమీ జాక్సన్.. మాస్ సినిమాలో..?

గురువారం, 13 నవంబరు 2014 (11:39 IST)
'ఎవడు' సినిమా ద్వారా గ్లామరస్ తారగా తెలుగుతెరకు పరిచయమైన ఎమీ జాక్సన్ త్వరలో దెయ్యం వేషం ద్వారా ప్రేక్షకులను భయపెట్టనుంది. సూర్యా హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న 'మాస్' సినిమాలో ఎమీ జాక్సన్ దెయ్యం రోల్ పోషిస్తోంది. 
 
ఈ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా వుందని ఆరోపిస్తూ, ఇటీవల ఆ ప్రాజక్టు నుంచి తప్పుకోవడానికి కూడా ఎమీ రెడీ అయింది. అయితే, దర్శకుడు ఆమెను కన్విన్స్ చేయడంతో మళ్లీ ఒప్పుకుంది. 
 
సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో ఈ చిన్నది ఘోస్ట్ పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమెపై సన్నివేశాలను బల్గేరియాలో చిత్రీకరిస్తారట. ఇందులో మరో కథానాయికగా నయనతార నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి