బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి కదా అని చెప్పి, దక్షిణాదిన వున్న అవకాశాలను అర్ధాంతరంగా వదిలేసి కొన్నాళ్ల క్రితం అక్కడికి చెక్కేసింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. నాలుగైదు సినిమాలు చేయగానే అక్కడ అమ్మడికి ఛాన్సులు నిల్ అయ్యాయి.
అదే సమయంలో సౌత్ నుంచి ఆఫర్లు వెళ్లినా, 'సారీ, నేను హిందీ సినిమాలే చేస్తా' అంటూ చెప్పేది. అయితే, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పరిస్థితి తారుమారైంది. బాలీవుడ్లో ఖాళీ అయిపోయింది.
సౌత్‌లో ఎవ్వరూ అడగడం లేదు. దీంతో తనకు తెలిసిన దక్షిణాది హీరోలను, దర్శకులను ఛాన్సు లిమ్మంటూ వాట్స్ యాప్ ద్వారా రిక్వెస్టులు పంపుతోందట. అయితే, ఎవరూ ఆమెకు పాజిటివ్ ఆన్సర్లు మాత్రం ఇవ్వడం లేదట! మరి అసిన్ ఏం చేస్తుందో..!