ఆ విధంగానే ఆ మధ్య నటి రాధికా ఆప్టే, ఇటీవల హన్సికలు బలయ్యారు. అయితే విషయం తెలిసిన హన్సికా తొలుత తడబడినా, ఆ తర్వాత కోలుకుని ఆ వీడియోలో ఉన్నది తానుకాదని తెలిపింది. అయినా కూడా ఆ వ్యక్తి హన్సిక చేతికి చిక్కాడంటే చిత్తు చేస్తుంది.
ఈ విషయం గురించి తాజాగా హన్సిక మాట్లాడుతూ.. సినీ స్టార్స్ అంటే ఏదో జాలీగా ఎంజాయ్ చేసేవాళ్లు అనుకోకండి అని తెలిపింది. తాము నిరంతరం షూటింగ్లలో పాల్గొంటూ శ్రపడుతున్నట్టు చెప్పింది. రహస్యంగా కెమెరాలు ఉంచి, తారల ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేయడం అనేది అత్యాచారం కంటే దారుణమైన విషయం అని హన్సిక అభిప్రాయపడింది.