సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ అంతా బ్రహ్మానందంకే వెళ్లిపోతోందన్న ఉద్దేశంతో ఈ చిత్రంలో నుంచి ఆయన్ని తప్పించారంటూ పలు రకాల వార్తలు హల్చల్ చేశాయి. అయితే, వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ, ఇందులో బ్రహ్మానందం ఉన్నారంటూ చిత్ర రచయితలలో ఒకరైన గోపీమోహన్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో నమోదు చేశారు. ఈ సినిమా కొత్త కథ, కథనాలతో తెరకెక్కుతుందని, ఇందులో మా శైలి హాస్యం వుంటుంది. బ్రహ్మానందం పాత్ర కీలకమైనది అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి కోన వెంకట్‌తో కలిసి గోపీ మోహన్ రచన చేస్తున్నారు.