అరిసెలు.. బూరెలంటే హన్సికకు చాలా ఇష్టమట!

శనివారం, 23 మే 2015 (15:36 IST)
టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన సినీనటి హన్సికకు అరిసెలు, బూరెలంటే తెగ ఇష్టమట. తెలుగు ప్రాంతాల వైపు షూటింగ్‌కు వస్తే వాటిని ప్రత్యేకంగా తెప్పించుకుని మరి లాగిస్తానని హన్సిక అంటోంది. సాధారణంగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముద్దుగా బొద్దుగా ఉంటే హన్సిక మూలాలు ముంబైలో వున్నప్పటికీ.. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వంటకాల విషయానికి వస్తే.. అరిసెలు, బూరెలు ముందున్నాయి. 
 
ముఖ్యంగా వైజాగ్, రాజమండ్రిలో వుంటోన్న తన అభిమానులలో కొందరికి తన అభిరుచి తెలుసనీ, అందువలన ఆ పరిసరాల్లో షూటింగ్ వున్నప్పుడు వాళ్లు వాటిని తయారు చేసుకుని మరీ తీసుకువస్తారని హన్సిక చెబుతోంది. మంచువారి బ్యానర్‌పై సినిమాలు చేసేటప్పుడు, భోజనంలో బూరెలు తప్పకుండా ఉంటాయని చెప్పుకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి