అయితే తను చేసుకోబోతున్న అమ్మాయి గురించి చెప్పమనగా, తను చాలా సాధారణమైన అమ్మాయని, తాను కూడా అంతేనన్నాడు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని, ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని షాహిద్ ముక్తాయించాడు. ఢిల్లీకి చెందిన మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని ఈ బాలీవుడ్ హీరో పెళ్లి చేసుకోనున్నాడని, అతని కంటే ఆ అమ్మాయి 13 ఏళ్లు చిన్నదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.