ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ద్వారా వేణు బాగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. అయితే, ఎంతో పాప్యులర్ అయిన 'జబర్దస్త్' టీవో షోలో ఓ కులాన్ని కించపరచారంటూ ఇటీవల వివాదం రేగడం తెలిసిందే. ఈ క్రమంలో ఫిలింనగర్లో ఇటీవల వేణుపై కొందరు దాడి చేయడం విదితమే. ఆ దాడిలో వేణు గాయాలపాలై ఆసుపత్రిలో చేరాడు కూడా. అయితే, ఇపుడు వేణును పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.