జోరుపెంచిన శ్రీలంక బ్యూటీ.. ఎగబడుతున్న నిర్మాతలు..

శుక్రవారం, 22 మే 2015 (16:38 IST)
బాలీవుడ్‌లో హీరో సల్మాన్‌ సరసన 'కిక్' సినిమాలో నటించి భారీ హిట్టును సొంతం చేసుకున్న శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్. ఈమె డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడుతున్నారు. దీంతో అమ్మడు జోరుపెంచింది. అందాల విందునే నమ్ముకున్న చాలా మంది హీరోయిన్లలో ఒకరైన జాక్వెలిన్ భారతీయ సుందరీమణులతో భిన్నమైన రూపంతో తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
 
రొటీన్ ముఖాల మధ్య కాస్త భిన్నంగా ఉన్న శ్రీలంక బ్యూటీని చూసేందకు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో జాక్వెలిన్‌కు డిమాండ్ బాగా పెరిగింది.  డిమాండ్ ఉన్నప్పుడే ఫిట్‌గా ఉండాలి కాబట్టి తన వంతుగా ఆమె కసరత్తులు చేస్తుంది. ఇంకా స్లిమ్‌గా మారి, మరింత ఆకర్షించేందుకు నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి