దర్శకుడు కె.బాలచందర్‌‌కు తీవ్ర అస్వస్థత : ఐసీయులో చికిత్స!

సోమవారం, 15 డిశెంబరు 2014 (18:12 IST)
తమిళ సినీ దర్శక దిగ్గజం కె. బాలచందర్‌‌ సోమవారం తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో హుటాహుటిన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తన స్వగృహంలో స్పహ కోల్పోయి పడిపోయారు. దీంతో ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. బాలచందర్‌ను వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళనలోనే ఉన్నారు. 
 
నిజానికి గత కొంతకాలంగా బాలచందర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలతో పాటు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దీంతోనే ఆయన కావేరి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. అయితే, సోమవారం ఉదయం ఉన్నట్టుండి బాలచందర్ ఆరోగ్యం విషమించింది. దాదాపు 80 ఏళ్ల వయసు ఉండటంతో చికిత్స కూడా కష్టం అవుతోందన్నారు. 
 
విశ్వవిఖ్యాత నటుడు కమల్హాసన్ తన గురువుగా బాలచందర్ను అభివర్ణిస్తారు. రజనీకాంత్, కమల్హాసన్, ప్రకాష్ రాజ్ వంటి అనేకమంది ప్రముఖ నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే కమల్హాసన్ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి