పవన్ కళ్యాణ్ నటించే ఛాన్సొస్తే ఇక మిస్ చేసుకోను: కాజల్

గురువారం, 26 జూన్ 2014 (16:54 IST)
రాష్ట్రమంతా పవర్ స్టార్ మంత్రం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రావడంతోనే రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అలా సినిమా, ఇలా సామాజిక వ్యవహారాల్లో తన సత్తా నిరూపించుంకుంటున్న పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్సొస్తే ఇక వదులుకోనని కాజల్ అగర్వాల్ మనసులోని మాటను బయట పెట్టింది. 
 
ఇకపై పవన్‌తో నటించే ఛాన్సొస్తే మిస్ చేసుకోనంటోంది. గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోనే పవన్‌తో కలిసి నటించే ఛాన్స్ తనకొచ్చిందని, అప్పట్లో ఆ ఛాన్స్ మిస్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.
 
తెలుగులో ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఇలా యంగ్ హీరోల సరసన నటించిన కాజల్ అగర్వాల్‌కు పవర్ స్టార్ సరసన నటించే అవకాశం మాత్రం రాలేదు. వచ్చిన ఒక అవకాశాన్ని వదులుకుంది. ఇకపై పవర్ స్టార్‌తో నటించే ఛాన్సొస్తే వదులుకునే ప్రసక్తే లేదని అంటోంది. అదీ సంగతి పవర్ స్టార్ పవరంటే అదన్నమాట. 

వెబ్దునియా పై చదవండి