తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న బబ్లీ గాళ్ నిత్యామీనన్ పెళ్లిమాట ఎత్తేసరికి ఫైర్ అవుతోంది. ప్రేమ- పెళ్లి వంటివన్నీ తన సొంత విషయాలని కరాఖండీగా చెప్పేస్తోంది. "అవును .. ప్రేమ, పెళ్లి వంటి విషయాలు వ్యక్తిగతం. అవి నా మనసుకు సంబంధించిన అంశాలు. వాటి గురించి బహిరంగంగా మరొకరితో పంచుకోవడం నాకు ఇష్టం వుండదు అని అంటోంది నిత్యా.
అందుకే, ఎవరైనా ఇలాంటి పర్శనల్ విషయాలు అడిగితే నాకు కోపం వస్తుంది. ఇంకెప్పుడూ అడక్కండి" అంటూ కటవుగానే చెబుతోంది ఈ బొద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ సినిమాలలో నటించడంపై అడిగితే, తనకు ఇంటరెస్ట్ లేదని చెప్పింది. "మంచి పాత్ర వస్తే ఏ భాషలోనైనా నటిస్తాను. అది బాలీవుడ్డే కానక్కర్లేదు" అంటోంది నిత్యామీనన్.