పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. పవన్‌కళ్యాణ్, బాలకృష్ణల కాంబినేషన్లో చిత్రం రూపొందనుందనే రూమర్ అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు సినిమా వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉండగా బాలకృష్ణ 99వ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి లౌక్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తాడు. అలాగే బాలయ్య 100వ చిత్రానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని, అందుకోసం ఓ క్రేజీ మల్టీస్టారర్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.