పవన్ కళ్యాణ్ స్పూర్తిగా తీసుకుని కొంతమంది అభిమానులు రూపొందించిన 'పవనిజం' అనే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు. ఇ.కె. చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మహేష్, నరేష్ నిర్మిస్తున్నారు. అభిమానులు తలచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో అనేది ఈ చిత్ర కథాంశం.