రుద్రమదేవిలో ప్రకాష్ రాజ్ ఫస్ట్‌లుక్: గెటప్ అదరహో!! (వీడియో)

శనివారం, 16 ఆగస్టు 2014 (17:50 IST)
రుద్రమదేవిలో ప్రకాష్ రాజ్ గెటప్ అదుర్స్ అనే టాక్ వచ్చేసింది. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రంగా గుణా టీమ్‌ వర్క్స్‌ బేనర్‌పై శ్రీమతి రాగిణీ గుణా సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకనిర్మాతగా రూపొందుతున్న 'రుద్రమదేవి' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 
 
ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క నటిస్తుండగా, కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నారు. 13వ శతాబ్ధానికి చెందిన రుద్రమదేవి ఆస్థానంలో రాజగురువుగా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక రుద్రమదేవి భర్తగా రానా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ గెటప్‌తో కూడిన రుద్రమదేవి ఫోటోలను విడుదల చేశారు. 
 
ఆ ఫోటోస్ అదిరిపోతున్నాయని, హిస్టారికల్ గెటప్‌లో ప్రకాష్ రాజ్ పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయాడని సినీ ఇండస్ట్రీలో టాక్.

వెబ్దునియా పై చదవండి