ఆ మధ్య తెలుగు, తమిళ చిత్రాల్లో క్రేజీ బ్యూటీగా వెలిగిన అందాల తార ప్రియమణి. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్, కోలీవుడ్ లకు దూరంగా ఉంటున్న అమ్మడుకి ఇన్నాళ్లకు మళ్లీ ఛాన్స్ వచ్చింది. దీంతో అడిగీ అడగ్గానే ఓకే చెప్పింది.
ప్రముఖ తమిళ దర్శకుడు రామ్ హీరోగా నటించే చిత్రంలో ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. విశేషం ఏమిటంటే, ప్రముఖ తమిళ దర్శకుడు, రచయిత మిస్కిన్ దీనికి కథను సమకూర్చడమే కాకుండా, ఇందులో విలన్ పాత్రను కూడా పోషిస్తున్నాడు.