తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్‌గా, గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పేరుపొందిన సునీత నటన వైపు కూడా తన చూపును మళ్లించింది. పలు రంగాలలో ప్రసిద్ధి చెందిన సునీత త్వరలో నటిగా కూడా తన సత్తా చాటుకోనుంది. 1995 లో 'గులాబీ' సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టిన సునీత గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.
ఇదివరకు పలు మార్లు, వివిధ దర్శకుల చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చినా, సునీత సున్నితంగా తిరస్కరించింది. ఇక తను ఇప్పుడు తన నిర్ణయం మార్చుకొని సినిమాల్లో నటించేందుకు సిద్దమయ్యింది. అన్నీ రంగాల్లో చలాకీగా వ్యవహరించే సునీత వెండితెరపై కూడా తన సత్తా చాటుకోబోతుంది.