అమెరికా కోర్టు సమన్లు...! కొట్టిపారేసిన అమితాబ్‌..!

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (14:14 IST)
బాలీవుడ్ బిగ్‍‌ బీ,  సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు అమెరికా కోర్టు సమన్లు జారీచేసింది. మానవ హక్కులను ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ నోటీసు ఇచ్చింది. 1984లో సిక్కులపై హింసకు అమితాబ్ ప్రేరేపించారని ఆరోపిస్తూ న్యూయార్క్ లోని సిక్ ఫర్ జస్టిస్ ప్రతినిధిని లాస్ ఏంజెల్స్ లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం అమితాబ్ కు సమన్లు జారీచేసింది. దీనిపై మార్చి నెల 17 తేదిలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అమితాబ్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి హింసను ప్రేరేపించలేదని, న్యాయస్థానంలోనే తేల్చుకుంటానన్నారు. గతంలో ఇదే అంశంలో మాజీ ప్రధాని మన్మోహగ్, ప్రధాని నరేంద్రమోదీకి కూడా అమెరికా కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి