కాజల్‌ ను కృష్ణవంశీ అడిగితే పైకి ఎక్కి ఆ తర్వాత దిగిందట

గురువారం, 9 జనవరి 2014 (16:43 IST)
WD
'మగధీర' తర్వాత కాజల్‌ అగర్వాల్‌ మరింతగా దూసుకుపోయింది. సినిమాల పరంగా కాదు. మాటల్లోనూ, చేతల్లోనూ చాలా స్పీడ్‌గా ఉంది. అది ఒక్కోసారి ఏరగెంట్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ రంగంలోనూ బాలీవుడ్‌లో ప్రయత్నిస్తుంది.

పారితోషికం పెంచడంతోపాటు తగ్గించే విధంగా ఏమాత్రం సహకరించకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇటీవలే కృష్ణవంశీ సినిమాకు ఛాన్స్‌ వస్తే మొదట బేరాలు ఆడిందట పారితోషికం పైపైకి అన్నట్లు స్టెప్స్ పైకి ఎక్కిందట. చివరికి స్టెప్‌ దిగిరాక తప్పలేదు. ఎందుకంటే ఇదికూడా పోతుందని సన్నిహితులు చెప్పడంతో దారికి వచ్చింది భామ.

వెబ్దునియా పై చదవండి