నాగచైతన్య చిత్రం... హన్సిక అవుట్ తమన్నా ఇన్

సోమవారం, 27 ఆగస్టు 2012 (13:00 IST)
WD
బెల్లంకొండ సురేష్ నిర్మాతగా, కిశోర్ కుమార్ దర్శకత్వంలో తమిళ "వెట్టాయ్" చిత్రం తెలుగు రీమేక్‌లో అక్కినేని నాగచైతన్య, నిన్నటి కమెడియన్ నేటి హీరో సునీల్ సోదరులుగా నటించనున్న విషయం తెలిసిందే.

ఐతే ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ముందుగా హన్సికను హీరోయిన్‌గా అనుకున్నా, ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకున్నరాట. హన్సిక స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఛాన్స్ ఇచ్చారట.

ఇప్పటికే గతంలో చైతు, తమన్న జంటగా నటించిన 100% లవ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కల్లెక్షన్ల వర్షం కురిపించగా అదే సెంటిమెంట్‌ను మరోమారు అంది పుచ్చుకోవాలని హన్సికను సైడ్ చేశారట. దీంతో కోలీవుడ్ జూనియర్ నమితగా పేరు తెచ్చుకున్న హన్సిక ఛాన్స్ మిల్కీ బ్యూటీ కొట్టేసిందని టాక్.

వెబ్దునియా పై చదవండి