నా శరీరాన్ని దాచుకుంటా.. చూపించను: జెనీలియా

ఇపుడు హీరోయిన్లందరూ విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. పొట్టి దుస్తులు.. బికినీల్లో తమ శరీరపు అందాలన్నిటినీ ప్రదర్శించేస్తున్నారు. మరి మీరు కూడా చేస్తారా...? అని జెనీలియాను ప్రశ్నిస్తే విలక్షణమైన సమాధానం చెప్పుకొచ్చింది. అదేమంటే.. ఎవరో ఏదో చూపిస్తున్నారని తను మాత్రం అటువంటి ఎక్స్‌పోజింగ్‌లు చేయదట. ముఖాన్ని మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తానని అంటోంది. తన శరీరాన్ని దాచుకుంటానని చెపుతోంది. 

" సై అనే చిత్రంలో కాస్త సెక్సీగా కన్పించాను. కానీ అందులో వల్గారిటీ ఎక్కడా కనబడదు. నేను నటించిన సినిమాలు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా చూస్తుంది. వాళ్లకు నచ్చనిది నేను చేయను. వాళ్లు మెచ్చుకోని సన్నివేశాలలో నేను ఎట్టి పరిస్థితుల్లో నటించను గాక నటించను. అందుకనేనేమో నాకు ఇటీవల కాస్త ఆఫర్లు తగ్గాయి. అయినా ఫర్లేదు.

మోడ్రన్ గాళ్ అయినా మోడ్రన్‌గా ఉంటాను తప్పించి శరీరాన్ని మాత్రం ఎక్స్‌పోజ్ చేయన"ని కచ్చితంగా చెపుతోంది. తాజాగా కథ అనే చిత్రంలో నటించిన జెనీలియాను ఎక్స్‌పోజింగ్‌పై కదిలిస్తే ఇలా చెప్పింది.

వెబ్దునియా పై చదవండి