నేను చీర కట్టినా కత్తిలానే ఉంటాను: ప్రియమణి

FILE
ప్రియమణి నటనకు నేషనల్‌ అవార్డ్‌ లభించింది. అయితే ఈ మధ్య నటనకంటే ఆమె చెప్పే మాటలు వినటానికి బాగుంటున్నాయి. యాక్టింగ్‌లో కొత్తకోణం చూసొండుచ్చు కానీ, మొదటిసారి ప్రియమణి మాటల్లో కూడా కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా రావలసిన పేరు ముందుగానే వచ్చేయటంతో, గ్లామర్‌ పాత్రలపై ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తూ వస్తోంది.

గత సంవత్సర కాలంలో ఆమె నటించిన చిత్రాలలో విచ్చలవిడిగా ఎక్స్‌పోజ్‌ చేసింది. మన తెలుగులో 'రగడ' సినిమాలో చేసిన స్కిన్‌షోలను అందరూ చూసే ఉంటారు. అలాగే కన్నడ, తమిళ చిత్రాలలో సైతం ఇదే తరహాలో రెచ్చిపోయింది. నటిగా మంచి పేరున్న మీరు, ఇలా ఎందుకు నటిస్తున్నారని అడగగా, నేనేమీ అతిగా చూపించలేదే.

చాలామంది హీరోయిన్లకంటే నేను పద్ధతి గానే కన్పిస్తున్నాను. అయినా నామీద సెక్సీ హీరోయిన్‌ ముద్ర ఉన్నప్పుడు చీరకట్టినా కత్తిలా ఉందంటారు. అంతా కూడా నన్ను చూసేవారి చూపులను బట్టి ఉంటుందని సూక్తులను వల్లిస్తోంది. ఇంత తెలివి, మాటతీరు, పనితనం ఉండబట్టే ఆమె సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో నార్త్‌, సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ అందరి సమక్షంలో తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి