నేనొస్తే.. మీ సంగతి అంతేనంటున్న సన్నీ లియోన్!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:43 IST)
File
FILE
ర్యాంప్ షోలు, బర్త్‌డే పార్టీలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌ను తాను రావడం మొదలెడితో హీరోయిన్లు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సిందేనని సినీనటిగా మారిన పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ అంటోంది.

ఇందుకు కారణం లేకపోలేదు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ వర్మ తన పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోకు సన్నీ లియోన్‌కు కూడా ఆహ్వానం అందడంతో ఆమె కూడా వచ్చింది.

అయితే, ఆమె వచ్చీ రాగానే అందరి దృష్టి ఆమెపైనే కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యంగా.. ఫోటోగ్రాఫర్లు పోటీపడి తమ కెమెరాలను క్లిక్‌మనిపించారు. దీంతో ఈ ఫ్యాషన్ షోకు వచ్చిన ఇతర సెలెబ్రెటీలు ఒక్కసారి అవాక్కయ్యారంట. ముఖ్యంగా షో టాపర్‌గా నిలిచిన ఒకప్పటి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కంటే సన్నీ లియోన్‌ అందరి చూపు కేంద్రీకృతమైంది.

వెబ్దునియా పై చదవండి