రామ్ చరణ్‌ కొత్త చిత్రం... బాబాయ్, అబ్బాయ్‌లతో త్రివిక్రమ్ బిజీ బిజీ!

గురువారం, 9 మే 2013 (14:48 IST)
WD
రామ్ చరణ్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు గతంలో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలయికలో వచ్చిన జులాయి సినిమాను నిర్మించిన ఎస్.రాధాకృష్ణ దీన్ని నిర్మించనున్నారని తాజా సమాచారం.

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్‌తో 'అత్తారింటింకి దారేదీ' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత పవన్ సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్ -2' సినిమా చేస్తాడు. ఆ సమయంలో త్రివిక్రం - చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును త్రివిక్రం ఇప్పటికే సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమా తరువాత త్రివిక్రం-పవన్ 'కోబలి' ప్రారంభమవుతుందని సినీవర్గాల సమాచారం. దీనిని బట్టి చూస్తే త్రివిక్రమ్ బాబాయ్, అబ్బాయ్‌లతో బిజీ బిజీ అవ్వనున్నాడన్నమాట.

వెబ్దునియా పై చదవండి