పౌరాణికాలకు సంబంధించిన ఈ కథలో ఫారెస్ట్ సీన్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఫారెస్ట్‌లో వానరాలు, పురాతకాలంనాటి దేవాలయాలు అక్కడ చూపించనున్నారు. ఇందుకోసం నిర్మాతలు 60 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సి.జి. వర్క్‌తోపాటు ఇతర టెక్నికల్ పనులకోసం వివిధ దేశాలనుంచి టీమ్ పనిచేస్తుందట. దీనికోసం 50 కంపెనీలు పనిచేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్. సినిమాను కూడా వివిధ దేశాలకు చెందిన టీమ్ పనిచేసింది. అప్పట్లో బాహుబలికి పనిచేసిన టీమ్‌తోపాటు మరికొంతమంది యాడ్ అయ్యారు. ఇప్పుడు అంతకుమించి వుండేలా ఆదిపురుష్ కోసం దర్శకుడు ఓంరౌత్ చర్యలు తీసుకుంటున్నాడు. ఈ వార్త ప్రభాస్ అభిమానులకు జోష్ కలగచేసింది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటిస్తోంది. ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.