అమీర్‌ఖాన్ అంటే బాలీవుడ్‌లో చాలామందికి గౌరవం. పెద్ద స్టార్ అయినా, విలక్షణ సినిమాల వైపు మాత్రమే మొగ్గు చూపుతుంటారు. కమర్షియల్ సక్సెస్‌ల గురించే ఆలోచించకుండా, వీలైనంత ఎక్కువ ఫోకస్ విలక్షణత వైపు దృష్టిసారిస్తుంటాడు. అందుకే అమీర్‌ఖాన్‌ని 'మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్' అని అంటారు బాలీవుడ్‌కు చెందిన ప్రతి ఒక్కరూ.
పైగా, ఎవరితోనూ అతనికి వివాదాలు లేవు. సినిమాల్లో ఈ హీరో ఎలా నటించినా.. పబ్లిక్ కార్యక్రమాల్లో మాత్రం చాలా హుందాగా నడుచుకుంటారు. కానీ, అనూహ్యంగా అమీర్‌ఖాన్ రూటు మార్చేశాడు. కావాలనే వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. అలాంటిది గురువారం ముంబైలో జరిగిన ''మామి'' ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈయన చేసిన పనికి అందరూ నివ్వెరపోయారు.
ఇంతకీ ఖాన్ ఏం చేశాడంటే... తన భార్య కిరణ్‌రావు పెదాలను పబ్లిక్‌గా ముద్దాడేశాడు. నిజానికి హాలీవుడ్ ఫంక్షన్‌లలో ఇలాంటివి సర్వసాధారణం. కానీ, మనదేశంలో మాత్రం ఇలా చేయడం చాలా అరుదు. అమీర్ కూడా ఇదివరకు ఇలా ప్రవర్తించలేదు. దీంతో అమీర్, కిరణ్‌రావు లిప్‌లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.