భీమవరం కుర్రోడు సునీల్. మొదట్లో కమెడియన్‌గా చేరి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. 6 ప్యాక్‌తో సరికొత్త సినిమాలను తీస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా పెద్దగా ఆయనకు అవకాశం రాలేదు. సినిమాలు లేకుండా పోయాయి. హీరోగా సునీల్ నటించిన కొన్ని సినిమాలు బాగా ఆడాయి కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ఆడలేకపోయాయి. దీంతో సునీల్‌తో సినిమా తీసేందుకు పెద్దగా నిర్మాతలు ఆశక్తి చూపడం లేదు. ముందు నుంచి చిరంజీవి కుటుంబం అంటే సునీల్‌కు ఎనలేని గౌరవం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే సునీల్‌కు ఎంతో ఇష్టం.
పవన్ కళ్యాణ్‌తో రెండురోజుల క్రితం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో సునీల్‌ను కలిసినట్లు తెలుస్తోంది. పిచ్చాపాటి మాట్లాడుకుందామని పవన్‌ను కలిసేందుకు సునీల్ వెళ్ళాడట. అయితే పవన్ మాత్రం సునీల్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదే జనసేన పార్టీలోకి రమ్మని. సినిమాలు ఉన్నప్పుడు దాని మీద ఏకాగ్రత పెట్టు.. ఖాళీగా ఉన్న సమయంలో పార్టీలో పనిచెయ్యమని పవన్ చెప్పాడట.