టాలీవుడ్ హీరోయిన్ కేథరిన్. అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' చిత్రంలో నటించినప్పటి నుంచి ఆమెను ప్రతి ఒక్కరూ యంగ్ ఎమ్మెల్యే అంటూ పిలుస్తున్నారు. ఈ యంగ్ ఎమ్మెల్యేకు చిరంజీవి సినిమాలో ఐటెంసాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. చిరంజీవి సినిమా అనేసరికి రెమ్యునరేషన్ గురించి పెద్దగా బేరసారాలు చేయకుండా ఓకే చెప్పేసింది.
అంతేకాదు, ఎన్ని డేట్లు కావాలన్నా ఇస్తానని కూడా ఆఫర్ చేసిందట. అలాగని కేథరిన్ ఖాళీగా ఏం లేదు. కోలీవుడ్ బిజీయెస్ట్ హీరోయిన్లలో కేథరిన్ ఒకరు. అలాంటి అమ్మాయి అతి తక్కువకే ఐటెంసాంగ్ చేయడం ఏమిటని? కొందరు ఆశ్చర్యపోతున్నారు.